ఇక్కడ ఈ పాట చూడండి
చిత్రం : రాజన్న (2011)
సాహిత్యం : కె.శివదత్తా
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : మాళవిక
అమ్మా.........అవనీ...........
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయనీ..
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ..
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
తల్లీ నిను తాకితేనె తనువు పులకరిస్తుంది
నీ ఎద పై వాలితేనె మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాన.. కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్నా
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాధలు వింటే..
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ - రిగగ రిగగ రిగ -
రిగగ రిగగ రిగ - రిగ రిస దప దస
రిగ గగ రిప పప - గద దద పద దద -
సద సద పగ పగ - సద సద సద సద
పద సద పద సద పద సద
సాస సాస సాస సాస - రిరి
సాస సాస సాస సాస - పాపా
రిగ రిస - రిగ రిస..రిగ రిస - రిగ రిస
సరి సరిగా రిసగా రిసగా రిస
రిగ రిగపా - గరి సదపా
గప పద దస - సరి గరి సద
పద దస సరి - రిగ మగ రిస - రీ గా మా
రిస దప దస రిగపా
సరి గప దస రిగపా
దప గరి సరి సద వీరమాతవమ్మా..రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా..నువ్వు ధన్య చరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా..
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అదిమించిన నాదన్నది నీకీగలదేదమ్మా..
అమ్మ అవని నేలతల్లి అని ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని?
అమ్మా.........అవనీ...........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి