2, జులై 2020, గురువారం

ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం పాట లిరిక్స్ - Aadadhe Aadhaam Mana Katha Aadane Arambham Song Lyrics in Telugu - Srimathi Oka Bahumathi (1987) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి










సినిమా : శ్రీమతి ఒక బహుమతి (1987)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : శంకర్ - గణేష్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం


కోతిమంద చేత సెతువుల్ని నిర్మింప 
చేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతోనే 
పోరింది ఆడదిరా

ఖడ్గతిక్కన్న కత్తి తుప్పుపట్టకుండ 
ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి చండభాను తేజం వెనుక 
వెలిగింది ఆడదిరా

వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాడ్ని నడుపుతున్నది అటువంటి ఆడదిరా

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు 
తెచ్చింది ఆడదిరా
అయ్యో భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి 
చంపింది ఆడదిరా

అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట 
చెడిపింది ఆడదిరా
ఆహ పల్నాడు నేలంతా పచ్చి నెత్తుట్లోన 
తడిపింది ఆడదిరా

కోడల్ని తగులబెట్టే అత్త కూడ ఆడదిరా
కోడల్ని తగులబెట్టే అత్త కూడ ఆడదిరా
ఈ మగవాడ్ని నేడు చెరిచింది ఆడదిరా

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

పంచ పాండవులకు కీర్తి కిరీటాలు 
పెట్టింది ఆడదిరా
అయ్యా ఇంద్రుడు చంద్రుడు 
అపకీర్తి పాలైన కారణం ఆడదిరా

పోతపోసిన పున్నమంటి తాజ్ మహల్ 
పునాది ఆడదిరా
అయ్యా మేటి సామ్రాజ్యల కోటలెన్నొ 
కూలగొట్టింది ఆడదిరా

మంచికయిన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
మంచికయిన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట అమే కధే పాడునురా

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం

ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం

ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి