31, జులై 2020, శుక్రవారం

నాలాగే అన్ని నాలాగే పాట లిరిక్స్ - Naalage Anni Naalage Song Lyrics in Telugu - George Reddy (2019) Telugu Songs Lyrics













చిత్రం : జార్జ్ రెడ్డి (2019)

సాహిత్యం : చరణ్ అర్జున్

సంగీతం : సురేష్ బొబ్బిలి

గానం : చరణ్ అర్జున్







నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన


చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా


ఓ..... ఓ... ఓ... ఓ... ఓ...


నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన 


చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా


మెల్లగా మెల మెల్లగా

తొలి అడుగులేసిన ప్రాయం

నేటికి నే మరవలే ఇంతలోనే ఎంతటి గాయం

వెలుగుకా అది వెనకకా ఎటువైపుకో నీ వేగం

ఎన్నడూ నే నేర్పలేదే నీకు ఇంతటి త్యాగం


పువ్వయ్యావు ముల్లవుతున్నావో

గురితించలేక ఉన్నాను చెట్టు కొమ్మోలే

నిన్నైతే కన్న నేను నీ రాతను కనుగొనలేను

ఏ తీరం నీ కథ చేరేనో


నిద్దరే అసలోద్దనే నిత్య పొద్దు పొడుపే నీవు

నల్లని ఆ మబ్బులే కమ్మేయాగలవా నిన్ను

అమ్మకే ఇక అందని శిఖరాలకెలుతున్నావు

ఈ నేలపై ప్రతి అమ్మకు నువు కొడుకులా ఎదిగావు


పోరాటం నీ నెత్తురులో ఉందా

నా పెంపకంలో ఏదో పొరపాటు జరిగిందా

గర్వంగా ఉన్నా గానీ కన్నా నా భయం నాది

ఎంతైనా కన్న కడుపు ఇది


ఓ..... ఓ... ఓ... ఓ... ఓ...


నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన



చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా






30, జులై 2020, గురువారం

అనితా ఓ అనితా పాట లిరిక్స్ - Anitha O Anitha ... Telugu Song Lyrics - Kalala Savvadi (2009) Telugu Album Songs Lyrics






అది 2009 వ సంవత్సరం చిన్న పాటగా విడుదలైన ఈ పాట ఒక బీభత్సాన్ని సృష్టించింది అనీ అంటే అతిశయోక్తి కాదేమో. అనితా ఓ అనితా పాట, నాగరాజు అనే యువకుడు ఒక క్యాసెట్ అల్బమ్ కోసం రాసి స్వరపరచి పాడాడు.యువతరం గుండెల్లోకి ప్రేమ బాణంలా దూసుకుపోయింది ఈ పాట.అప్పట్లోనే మొబైల్ Wap సైట్స్ లో అత్యధికంగా డౌన్ లోడ్స్ చేసుకున్న పాటగానూ రికార్డు సృష్టించింది అంటే ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

అంతగా ఆదరణ పొందిన ఈ పాట
ఈరోజు మన నేను నా పాట లో 

ఇక్కడ ఈ పాటని చూడండి




ఆల్బమ్ : కలల సవ్వడి (2009)
సాహిత్యం : నాగరాజు
సంగీతం : నాగరాజు
గానం : నాగరాజు


నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలో కూడా నీ రూపం నను కలవరపరిచేనే
కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టేలే

నువ్వోక చోట నేనోక చోట
నిను చూడకుండనే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే
నా రేపటి స్వప్నం నీవే
నా ఆశల రాణివి నీవే
నా గుండెకు గాయం చేయాకే

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా..

నువ్వే నా దేవతవని యదలో కొలువుంచా
ప్రతి క్షణము ధ్యానిస్తూ పసి పాపల చూస్తా
విసుగు రాని నా హృదయం
నీ పిలుపుకై ఎదురు చూసే నిను పొందని
ఈ జన్మే నాకెందుకనే అంటుందే
కరునిస్తావో కాటేస్తావో
నువు కాదని అంటే నే శిలనవుతానే

నను వీడని నీడవు నీవే
ప్రతి జన్మకు తోడువు నీవే
నా కమ్మని కలలు కూల్చి
నను ఒంటరివాన్ని చేయకే

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే
ఒక్క చిన్ని ఆశ నాలో
చచ్చేంతా ప్రేమ మదిలో

ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన


29, జులై 2020, బుధవారం

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ పాట లిరిక్స్ - Vacchindamma Vacchindamma Song Lyrics in Telugu - Geetha Govindam (2017) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సిద్ శ్రీరామ్

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

దేవ దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
హారతిపళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా

సాంప్రదాయణీ శుద్ధ పద్మిని
ప్రేమ శ్రావణీ సర్వాణీ
సాంప్రదాయణీ శుద్ధ పద్మిని
ప్రేమ శ్రావణీ సర్వాణీ

ఎద చప్పుడుకదిరే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్నీ కాటుకనై చదివేనా

చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా
ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన
నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా

ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

ఏకాంతాలన్నీ ఏకాంతం లేక
ఏకరువే పెట్టాయే ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక
కన్నీరొంటరాయే నిలువ నీడ లేక

ఎంతదృష్టం నాదేనంటూ
పగబట్టిందే నాపై జగమంతా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా
నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా

మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటున కుంకమ బొమ్మ
ఓ వెయ్యేళ్ళాయుష్షంటూ దీవించిందమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా




28, జులై 2020, మంగళవారం

పిడికెడు హృదయమిదా పాట లిరిక్స్ - Pidikedu Hrudayamidaa Song Lyrics in Telugu - Nakili (2012) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి











చిత్రం : నకిలి (2012)
సాహిత్యం : వనమాలి
సంగీతం : విజయ్ ఆంటోని
గానం : విజయ్ ఆంటోని







పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

నువు కోరువైపే
నది సాగుతుందా
దరి చేరుదాక వేంటాడు

కన్నీరు నింపే ప్రతి గుండె కోత
కడతేరుదాక పోరాడు

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా

కడలిని కలిసిన చినుకా
కలత పడకు

అలలను తరుముతు ఆడు
కలదు బ్రతుకు

విరిగిన మనసును అతుకు
కలల కొరకు

ఉలిసడి తెలిసిన శిలలే
కలలో ఉలుకు

సుడిని అదిగమించ నావేగా
తిరిగి చేరుతుంది తన తీరం
సూది మొనలే తన నేస్తంగా
వలువ దాల్చుతుంది ఆకారం
నిశిలో వెతుకు వెలుగే
దొరుకు ఈవేళ

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

కలలుగ విరిసిన మనసా
వలదు కునుకు

వెలుగులు పరిచేను దారే
కదిలి ఉరుకు

వలదిక మరి ఇక వెనకడుగు
ఎదురుతిరుగు

వీధికిక వెరవక సాగు
చివరి వరకు

కరుకు పిడుగులున్న ఆ మేఘం
కరిగి తీర్చుతుంది నీ దాహం

నిన్ను తాకుతున్న ఈ గాయం
నీకు చూపుతుంది ఓ గమ్యం
తలచే విధమే ఎపుడు జరుగు నీకైనా

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

నువు కోరువైపే
నది సాగుతుందా
దరి చేరుదాక వేంటాడు

కన్నీరు నింపే ప్రతి గుండె కోత
కడతేరుదాక పోరాడు






27, జులై 2020, సోమవారం

ఏమో ఏమో ఏమో పాట లిరిక్స్ - Emo Emo Emo Song Lyrics in Telugu - Devadas (2019) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : దేవదాస్ (2019)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : సిద్ శ్రీరామ్, రమ్య బెహరా


ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో

ఏమో ఏమో ఏమో
వెలుగు వాగు నాలో పొంగిందేమో

ఉందో లేదో ఏమో
కాలి కింద నేలే కరిగిందేమో

మాయో మహిమో ఏమో
నేల కాస్త నింగై మెరిసిందేమో

ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇలాంటిదేదొ ఉన్నదంటే విన్న మాట కాదే


రాదే రాదే రాదే
నెమలి కన్ను కలలో రూపం నీదే

రాదే రాదే రాదే
ఎడమ వైపు ఎదలో దీపం నీదే

లేదే లేనే లేదే
ఇంత గొప్ప అందం ఇలలో లేదే

ఉండే ఉంటే ముందే
చూసినట్టు ఎవరూ అననే లేదే

పోల్చేదెలా ఇలా అని నీలాగ ఉంది నువ్వే
నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే

ఓ .. ఓ .. ఓ .. ఓ ... ఓ ..

లాలీ లాలీ అంటూ
జోల పాట పాడే పవనం నువ్వే

లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే కిరణం నువ్వే

నాలో భావం నువ్వే
రూపు కట్టి ఇల్లా ఎదురైయ్యావే

నాలో జీవం నువ్వే
ఆశ పెట్టి ననిలా కవ్విస్తావే

లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా దోబూచులాడినావే

ఓ .. ఓ .. ఓ .. 


26, జులై 2020, ఆదివారం

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా పాట లిరిక్స్ - Nuvvunte Naa Jathaga Song Lyrics in Telugu - I - Manoharudu (2015) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : ఐ - మనోహరుడు (2015)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరామ్, ఇష్రత్ ఖాధ్రీ

వీచే చిరుగాలిని వెలివేస్తా
హో' పారే నదినావిరి చేస్తా
నేనున్న నేలంతా

ఆ .. ఆ .. ఆ ..

మాయం చేసా
లేనేలేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
ఊపిరిగా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా (నా జతగా)
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వైనా నమ్మవుగా
చెలియా నేనెవరంటూ
ఎవరూ గుర్తించరుగా
నా ప్రేమవు నువ్వంటూ

నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
నువ్వుంటే నా జతగా

ఓ .. ఓ .. ఓ .. ఓ .. ఓ ..

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా

సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా

అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
పువ్వుల్లోని తేనె పురుగులకందునా
మొసలి తగిలి మొగ్గనై మొలిచా
బూచినే చూసిన పాపనై బెదిరా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

ఓహో

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా

ఆ .. ఆ .. ఆ ..

నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే .....
నువ్వుంటే నా జతగా

25, జులై 2020, శనివారం

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో పాట లిరిక్స్ - Yegire Yegire Hrudhayamendhuko Song Lyrics in Telugu - Madhanam (2019) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం: మథనం (2019)
సాహిత్యం : పూర్ణ చారి
సంగీతం : రాన్ ఈధన్ యోహన్
గానం : సిద్ శ్రీరామ్

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో
ఎవరే ఎవరే ఎదలో మథనమెందుకో

తననే వెతికే క్షణమే మధురం
పరుగై కరిగే సమయం
తనుగా ఎదురై కలిసే తరుణం
అలుపే అనక మొదలే తొలిపయనం

ఉన్నట్టుండి నువ్వు నా ముందుకొచ్చావు
అర్థం కాని సందేహంలోకి నెట్టావు
నన్నే నీలోనే ముంచావులే
మైమరపే పెంచావులే

నిన్నమొన్నల్లోన నా లోకమే వేరు
నీ రాకతో మారిపోయింది నా తీరు
నేడే నీవల్లే చూశానులే
సరికొత్త సంతోషాలు

పాదం తిరిగింది నీవైపుకే
ఆపే వీలేది లేక
కళ్లే మొలిచాయేమో మనసుకే
ఎన్నడూ ఎదురు చూళ్లేని
ఈ తొందరేమిటోతడబాటేమితో
వింతగా ఉంటుందేమిటో

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో

ఆహా ఆహా ఆహా
ఆ.. ఆ .. ఆ ..

నీ మాటల్నే ఏదో మంత్రంలా వింటాను
చుట్టూ అంతా మరచి చిత్రంగా చూస్తాను
నిన్ను ఊహల్లోనే ఉంటాను
నిను దాటి పోనే పోను

నింగే తాకిందేమో సంబరం
నిన్నే చేరాలనేమో
నీతో ఉంటేనే నాకో వరం

ఎవ్వరూ తెలుసుకోలేని ఈ భాష నాదని
అది ప్రేమే అని
నా పని తనతోనే అని

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో


24, జులై 2020, శుక్రవారం

జాజిమోగులాలి పాట లిరిక్స్ - Jajimogulaali Song Lyrics in Telugu - George Reddy (2019) Telugu Songs Lyrics












చిత్రం : జార్జ్ రెడ్డి (2020)
సాహిత్యం : 
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : ఇంద్రావతి






మసక మసక మబ్బులేంత జాజిమోగులాలి
ముసురుకునే చీకటేంత జాజిమోగులాలి

మనసునిండా ఎన్నెలుండ జాజిమోగులాలి
గుండె పొద్దు పొడుపు జెండ జాజిమోగులాలి

నిద్రలున్నా మెలుకున్నా జాజిమోగులాలి
నవయుగపు కలలుకందాం జాజిమోగులాలి

రండి ఆడి పాడుదాము జాజిమోగులాలి
ఉస్మానియా 
గళలై జాజిమోగలాలి



నలిగిపోదు న్యాయమెపుడు జాజిమోగులాలి

ఎదిరిస్తునే అడుగేయ్ జాజిమోగులాలి

అణిచివేస్తే ఆగమని జాజిమోగులాలి

హక్కులకై సవాల్ చేయ్ జాజిమోగులాలి

నీరాశలన్ని దూరం చేయ్ జాజిమోగులాలి

ఆశలూది రాజేయ్ జాజిమోగులాలి

పెనుమంటల తరంమంటు జాజిమోగులాలి

ఉస్మానియా జ్వలించు జాజిమోగులాలి



పల్లె మన పాఠశాల జాజిమోగులాలి

సంఘర్షణ లేనిదే జాజిమోగులాలి

మారబోదు మన చరిత్ర జాజిమోగులాలి

సమరాగ్రుల కాంతులెంట జాజిమోగులాలి

వెలకట్టని త్యాగముంది జాజిమోగులాలి

శ్రామికుల రాజ్యంకై జాజిమోగులాలి

విప్లవాల యుగం ఇదని జాజిమోగులాలి

ఉస్మానియా పోరాటం జాజిమోగులాలి



భగత్ సింగ్ ని కన్న జగతి జాజిమోగులాలి

నవ యుగపు కలలు కందాం జాజిమోగులాలి

ఇది ఉస్మానియా ఆవేశం జాజిమోగులాలి

ఇది విద్యార్థుల పోరాటం జాజిమోగులాలి

రండి ఆడి పాడుదాము జాజిమోగులాలి

సుడిగాలై రేగుదాము జాజిమోగులాలి

23, జులై 2020, గురువారం

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి పాట లిరిక్స్ - Vayyarala Jabilli Voni Katti Song Lyrics in Telugu - Teenmaar (2012) Telugu Songs Lyrics







ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : తీన్ మార్ (2011)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : మణిశర్మ
గానం : కారుణ్య










వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నదివలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతికా

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే
నా ఎద గుడిలో
నీ అలికిడిని పదాలు పలుకవులే

అణువణువూ చెలిమి కొరకు
అడుగడుగూ చెలికి గొడుగు

ఇది వరకూ గుండె లయకు
తెలియదులే ఇంత పరుగు

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై
చుగాలు తొణికేనులే

నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికేనులే

గగనములా మెరిసి మెరిసి
పవనములా మురిసి మురిసి

నిను కలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరిచి

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే








22, జులై 2020, బుధవారం

సామజవరగమన నిను చూసి ఆగగలనా పాట లిరిక్స్ - Samajavaragamana Song Lyrics in Telugu - Ala Vaikuntapuramlo (2020) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : అల వైకుంఠపురములో (2020)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : సిద్ శ్రీరామ్

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు
ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే
నిష్టూరపు విలవిలలూ

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా


నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు


మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన
ఎదురు పడిన
వన్నెల వనమా

విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె
ఎన్నెల వశమా

అరె నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా

ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలూ


21, జులై 2020, మంగళవారం

ప్రేయసి కావు నేస్తం కావు పాట లిరిక్స్ - Preyasi Kavu Nestham Kavu Telugu Song Lyrics - Vennela (2005) Telugu Songs Lyrics



నాకు ఇష్టమైన సినిమాల్లో ' వెన్నెల '
ఒకటి, 2005 లో వచ్చిన ఈ చిత్రం 
చాల తక్కువ బడ్జెట్ తో అమెరికా బ్యాక్ డ్రాప్ లో 
చిత్రీకరించారు.అక్కడ ఎం.ఎస్ చదవటానికి వెళ్లిన 
నలుగురు యువకుల కధ, మంచి కధ, కథనాల తో 
దర్శకుడు దేవా కట్టా గారు చాల బాగ ఈ సినిమాని తీసారు.

ఈ చిత్రంలోని ప్రేయసి కావు పాట 
నాకు చాల ఇష్టమైన పాట 
ఈరోజు మన నేను నా పాట లో 

ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : వెన్నెల (2005)
సాహిత్యం : దేవ కట్టా
సంగీతం : మహేష్ శంకర్
గానం : రిషి


ప్రేయసి కావు.. నేస్తం కావు..

గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావు

చీకట్లో వెలుగిస్తావు
జగమంతా కనిపిస్తావు..

పండుగ నీవు... నా పచ్చిక నీవు...
పండుగ నీవు... నా పచ్చిక నీవు...

మోహమే మంటగా రగులుతున్నా

లోకమే నీవుగా మునిగివున్నా

గాలిలో ఈకల తేలుతున్నా

నీటిలో రాతలా చెదిరివున్నా

నీ శ్వాసకోసం మానై ఉంటా
నీ మాటకోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వుకోసం అలుసై పోతా

జాబిలికే వెన్నెల నీవు
సూర్యునికే వేకువ నీవు

ఊపిరిలో ఉష్ణం నీవు
ఊరించే తృష్ణం నీవు

శూన్యం నీవు నా శోకం నీవు
శూన్యం నీవు నా శోకం నీవు

వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పి నన్ను ఆదుకోవా

నీ తోడుకోసం ఆవిరైపోనా
నీ స్పర్శకోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా

నీలానికి నింగివి నీవు
కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు
భావానికి మూలం నీవు

ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం

ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం



20, జులై 2020, సోమవారం

ఏ నవ్వు వెనకాల - Ye Navvu Venakala Telugu Song Lyrics - Genius (2012)



అప్పట్లో ఈ సినిమా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు 
చిన్నికృష్ణ గారి కధ, మరియ పరుచూరి బ్రదర్స్ రచన
ఓంకార్ అన్నయ్య దర్శకత్వం ఇలా 
చాల చేసారు తీరా సినిమా విడుదలయ్యాక 
ఏమి లేదని అర్దం అయ్యింది.
ఈ సినిమాలో శంకర్ మహదేవన్ గారు పాడిన 
ఈ పాటను ఈ రోజు మన నేను నా పాటలో 
కృష్ణ చైతన్య గారు దీనికి సాహిత్యం అందించారు 
 
ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : జీనియస్
సాహిత్యం : కృష్ణ చైతన్య
సంగీతం : జోష్వా శ్రీధర్
గానం : శంకర్ మహదేవన్

ఏ నవ్వు వెనకాల
ఏ కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా

ఏ చెలిమి నీకోసం వెన్నంటి ఉంటుందో
వీడుకోలే తెలుపలేని నిమిషమిది ఏం చేస్తాం

గెలుపులో గర్వం ఉంది ఓటమికే ఒర్పుంది
ఫలితమే తెలియని ఆటకు పేరు జీవితమంది

కనులలో కలలు లేవు కన్నీళ్లు రావసలు
రేపింక ఏదేమైనా నవ్వుతాయి కనులు

అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా

అంతలేసే సూరీడులా
అరే రేయిలో నిదరోతాడురా
తన చిన్ననాటి కలకంటు
మునిమాపుల లోయల్లో..... ఓ ...

హో .... ఏ నవ్వు వెనకాల
ఏ కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా

ఏ చెలిమి నీకోసం వెన్నంటి ఉంటుందో
వీడుకోలే తెలుపలేని నిమిషమిది ఏం చేస్తాం

హే గాలి ఆ నీరు ఈ మన్ను మిన్ను
ఈ స్నేహం ఉంటుంది మీరున్ననాళ్లు

వాన మా వెంటే అరే పెరిగెడుతుంటే
మా నీడే అడిగింది తన గొడుగవ్వంటు

ఓ ... ఓ ....
కలిసాడిన ఆటల్లో
కోనేటి స్నానాలు ఎండైనా వానైనా
కేరింతల హరివిల్లు

బడిలోని గుంజిళ్లు గుడిలోనే దండాలు
విడివిడిగా లేనేలేము మేము ...

అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా

అంతలేసే సూరీడులా
అరే రేయిలో నిదరోతాడురా
తన చిన్ననాటి కలకంటు
మునిమాపుల లోయల్లో..... ఓ ...

ఏ నవ్వు వెనకాల
ఏ కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా

ఏ వంచెనే నిమిషం మొదలాయోనో పాపం
రెక్క విరిగి ఎగిరలేని పక్షినీ ఏమంటాం

ఊహలకు జననం లేదు
ఆశకే గతి లేదు
అయువై ఎగసే కెరటం
నిలబడిందే లేదు

కలహల కలయికలెన్నో
ఆటకే సొంతంరా రేపింక ఏదేమైనా
నవ్వుతునే ఉంటాం

అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా

అంతలేసే సూరీడులా
అరే రేయిలో నిదరోతాడురా
తన చిన్ననాటి కలకంటు
మునిమాపుల లోయల్లో..... ఓ ...


19, జులై 2020, ఆదివారం

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి పాట లిరిక్స్ - Egiregire Vacchesane Ninne Kori Song Lyrics in Telugu - Sailaja Reddy Alludu (2018) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : శైలజారెడ్డి అల్లుడు (2018)
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : గోపీ సుందర్
గానం : సిద్ శ్రీరామ్, లిప్సిక


ఏ ఊరు ఎ దారి ఏ దూరమైనా
నేరాన చేసేసి ఏ నేరమైనా

గదులు ఆపేనా నదులు ఆపేనా
నేను దాటేయనా చాటేయనా ప్రేమని

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే

ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాగా)

అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)

నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే
నీతోనే నేనున్నా లేనట్టే
కోపాలేవే రానే రావే

నే చూపలేన నీకోసం
ఈ చేతిలోన ఆకాశం

తెలియనే ఏ తెలియదే
ఇష్టం అంటే ఇదే అని

ఓ .. ఓ ..

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాగా)

అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)

ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాగా)

అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)



18, జులై 2020, శనివారం

హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది పాట లిరిక్స్ - Hrudayamentha Thapisthe Brathuku Song Lyrics in Telugu - Needi Naadi Oke Katha (2018) Telugu Songs Lyrics



నాకు ఈ చిత్రం వ్యక్తిగతంగా చాల ఇష్టం. 
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న 
ఒక సమస్యను దర్శకుడు చాల
చక్కగా వివరించారు, ఈ పాటలో 
పూర్తి కధను మనకు తెలియచేశారు

మనసుకు హత్తుకునే ఈ పాట 
నేడు మన నేను నా పాట లో 


ఇక్కడ ఈ పాటని చూడండి









చిత్రం : నీది నాది ఓకే కథ (2018)
సాహిత్యం : ఎం.బి.డి.శ్యామల
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : కె.స్వరూప









హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది 
గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది
రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా?
మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది

మాటలెన్ని జారావో నోటినడుగు చెబుతుంది 
పాటించిననాడే పలుకు విలువ తెలిసింది

చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది
నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది

ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా 
అడుగడుగూ నిషేధానా కాంక్ష విలువ తెలిసింది 

ప్రతి మనిషికి కోరికుంది
ప్రతి మనసుకు స్పందనుంది
అనుభూతులు కొలిచే ఆ మమత విలువ తెలిసింది

హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది
గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది.

జీవితమే మరలిరాని ఒకే ఒక్క వరము కదా
స్వేచ్ఛ అనే ఊపిరిలో
కలల విలువ తెలిసింది






17, జులై 2020, శుక్రవారం

నా వల్లకాదే నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది పాట లిరిక్స్ - Naa Valla Kaadhe Nuvvu Dhooramavvake Song Lyrics in Telugu - Romantic (2021) Telugu Songs Lyrics









ఇక్కడ ఈ పాటని చూడండి



 






చిత్రం : రొమాంటిక్ (2021)
సంగీతం : సునీల్ కశ్యప్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : సునీల్ కశ్యప్








నా వల్ల .. నా వల్ల .. హో.. ఓ..
నా వల్ల .. నా వల్ల .. ఓ.. ఓ..


నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు లేకపోతే బతకలెనులే

నిన్నే నా మనసు తో ఎపుడైతే చూసానో
అపుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్లనుంచి నీరులాగ నువ్వు జారగా
కాళ్లకింద భూమిజారినట్టువుందిగా

నా వల్లకాదే .. నా వల్లకాదే ..
నా వల్లకాదే .. నా వల్లకాదే ..

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా
నీకై ఆశగా చూస్తుండదా

నీకేలాగ ఉందో గాని ఈ క్షణం
చిమ్మ చీకటైంది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం
ఒకలాంటిదే కదా

ఆ ... ఆ ....

నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు లేకపోతే బతకలెనులే

నువ్వే నేననేంత స్వార్థం కదా
నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా

వంద యేళ్ల పంచ బొట్టు నీ జ్ఞాపకం
వచ్చి చూడేలగ ఉందో నా వాలకం
నీ ధ్యాసనాపడం నా స్వాసనాపడం
రెండొక్కటే కదా ...

ఓ.. ఓ...

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బతకలెనులే




16, జులై 2020, గురువారం

మేరానాం జోకరు మేరాకాం నౌకరు పాట లిరిక్స్ - Mera Naam Joker Mera Kaam Nowkar Telugu Song Lyrics - Little Soldiers (1996) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : శ్రీ కొమ్మినేని
పాడినవారు : శ్రీ కొమ్మినేని, దీపికా


సరేలే ఊరుకో.. పరేషానెందుకు..
సరేలే ఊరుకో.. పరేషానెందుకు..

చలేసే ఊరిలో జనాలే ఉండరా..
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా..

అదోలా మూడుకాస్తా మారిపోతె మూతి ముడుచుకునుంటారా...

ఆటలోను పాటలోను
మూడు మళ్ళి మార్చుకోరా

మేరానాం జోకరు.... మేరాకాం నౌకరు.....
ఇదో నా చేతిలో అలాదీన్ లాంతరు....
ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు......

ఖరీదేం లేదుగాని
ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్సు కొట్టి ఈలలేస్తే
చూపుతారే నా నమూన

పిల్లిపిల్లదెప్పుడు ఒకే మాటకద
మియావ్ మియావ్ మియావ్
మియావ్ మియావ్ మియావ్

కోడిపిల్లదెప్పుడు ఒకే కూతకద
కొ కొ కోక్కొరొకొ కొ కొ కొక్కోరొకొ

కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే

అలాగే నీ పెదాల్లో
నవ్వులెప్పుడు మారనీయకె ఏమైనా
కష్టమొస్తే కేరుచెయ్యక
నవ్వుతో తరిమేయవమ్మ

మేరానాం జోకరు.. మేరాకాం నౌకరు..
ఇదో నా చేతిలో అలాదీన్ లాంతరు..
ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు..

ఖరీదేం లేదుగాని
ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్సు కొట్టి ఈలలేస్తే
చూపుతారే నా నమూన

గూటిబిళ్ళ ఆడదాం సిక్సర్ కొడదాం..
క్రికెట్ కాదుకాని ఫన్నిగానే ఉంది

ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం..
బఫెల్లోసుకది బాత్రూం కాదమరి

రాణిగారి ఫోజులో నువు కూరుకోమ్మ ఠీవిగా
గేదెగారి వీపు మీద షైరుకెళ్దాం స్టైలుగా

జురాసిక్ పార్కుకన్నా
బెస్టుప్లేసి పల్లెటూరే బుల్లెమ్మా
బోలెడన్ని వింతలుంటయ్
బోరులేక చూడవమ్మ

మేరానాం జోకరు.. మేరాకాం నౌకరు..
ఇదో నా చేతిలో అలాదీన్ లాంతరు..
ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు..

ఖరీదేం లేదుగాని
ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్సు కొట్టి ఈలలేస్తే
చూపుతారే నా నమూన


15, జులై 2020, బుధవారం

అనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం పాట లిరిక్స్ - Aanandam Ante Ardham Choopincheti Song Lyrics in Telugu - Uma Maheswara Ugra Roopasya (2020) Telugu Songs Lyrics #UMUR




ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : బిజిబల్
గానం : గౌతమ్ భరద్వాజ్, సౌమ్య రమ్యకృష్ణన్ 


అనందం ......
ఆరాటం .......

అనందం అంటే అర్ధం చూపించేటి
ఓ అద్భుతం

ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే
ఈ సంబరం

చిగురై పుడమి కడుపున
మొదలయ్యేటి ఆ మధనమే మధురమై

ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా

ఫలితం మరిచి పరుగేతీసే
పయనం ఇక ప్రతి పూటోక
కానుక అయిపోదా


నీరు ఆవిరిగ ఎగిసినది
తపన పెరిగి అది కడలినొదిలినది
కారు మబ్బులుగ మెరిసినది

అనువు అనువు
ఒక మధువుగ మారి
తానే ..... వానై .......

అడుగు అడుగు కలిపి
కదిలిపోయే కడలింటి దారే

మలుపేదైనా గెలుపే చూసే
అడుగుల్లో అసలైన ఆ ఆనందం

కదిలే నదిలో ... ఎగిసే అలలా
ఎదలోపల క్షణమాగని
సంగీతం కాదా


ఇంద్రధనస్సులో వర్ణములే
పుడమి ఒడిలో పడి
చిగురు తొడిగినవి

శరదృతువులో సరిగమలే తడిమే
తొలి పిలుపుగా మారి
దాహం .... తీరే ...

విరుల శిరులు విరిసి
మురిసిపోయే
సరికొత్త మాయే

ఉబికే మౌనం
ఉరికే ప్రాణం
తన కోసం దిగివస్తే
ఆ .. ఆకాశం

కరిగే దూరం తెరిచే ద్వారం
జగమంతట పులకింతలు
పూసే వాసంతం


అనందం అంటే అర్ధం చూపించేటి
ఓ అద్భుతం

ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే
ఈ సంబరం

చిగురై పుడమి కడుపున
మొదలయ్యేటి ఆ మధనమే మధురమై

ఉదయం కోసం ఎదురే చూసే
నిమిషాలే నిజమైన వేడుక కాదా

ఫలితం మరిచి పరుగే తీసే
పయనం ఇక ప్రతి పూటోక
కానుక అయిపోదా 


14, జులై 2020, మంగళవారం

భారతీయ భగవద్గీత అథునీయ అయిర్వేద పాట లిరిక్స్ - Karma Telugu Movie Tilte Song Lyrics - Karma (2010) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : కర్మ (2010)
సాహిత్యం : కవి ' రియల్ '
సంగీతం : పీట్ వండర్
గానం : కవి ' రియల్ '

ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణ

భారతీయ భగవద్గీత అథునీయ అయిర్వేద
ఆంగ్ల భాష కావలంటే సత్య కవి కాదన్నడే

ఇతిహాసాం తెలిసినవాడ్ని
మణప్పురాణం చదివినవాడ్ని
రామాయణాన్నే మరిచిపోయే
యువకులు నిద్రపోయే

రేయ్ అనీ మాట చెప్పి లేదని సిరం ఊపి
ఎయ్ అనీ అమ్మాయి చూసి
హే అనీ అబ్బాయి లేచి
కాద అన్న వెనకబడి ఎయ్ అనీ ప్రశ్నలడిగి

జీవితాన్నే మర్చిపోయి
ప్రాణాలే వదులుకున్నాడు
ఏయ్ అనీ తల్లిదండ్రులు
బాధ పడుతున్నప్పుడు

కృష్ణుడి మాటల్నే అర్దం చేసుకున్నప్పుడు
కూతుళ్లు సాధించేది మందు తాగేసినపుడే
ఈ లోకం ఆధునికం అనుకున్నప్పుడే

రావలిరా క్రాంతి రావలిరా
లేవలిరా భ్రాంతి పోవాలిరా

రావలిరా క్రాంతి రావలిరా
లేవలిరా భ్రాంతి పోవాలిరా

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

ఆ .. ఆ .. కర్మ
ఆ .. ఆ .. కర్మ

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

మనం చేసే పాపం పుణ్యం
దేవుడిచ్చే వరం శాపం
న్యాయం ధర్మం నిలబడుతుందా
అవసరమైన సత్యం ఉందా

పుణ్యాత్ముల్ని గెలిపించండి
మూర్ఖత్వాన్ని తొలగించండి
సనాతనాన్ని స్తాపించండి
భగవత్ రూపాన్ని గుర్తించండి

యుగాలు కాలలు వారాలు
అవన్నీ మారోచ్చు
నిజాలు స్థానాలు వేదాలు
అర్ధాలు మారవు

విష్ణువు చూస్తాడు ప్రాణాలు
లోకంలో అందరివీ
తీస్తాడు ప్రాణాలు ఈశ్వరుడు
త్రీనేత్రం తెరిచి

సోదర గుర్తించు నా తీరు నా తెన్నులు
నిదర పోయను ఇన్నేళ్లుగా మరి ఎంందుకు

లేచాను నా మాట నా పాటల్ని గుర్తించూ
ప్రాణమే పోయిన దొరకాలి నిర్వానము

రావలిరా క్రాంతి రావలిరా
లేవలిరా ధైర్యం కావాలిరా
రావలిరా క్రాంతి రావలిరా
లేవలిరా ధైర్యం కావాలిరా

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

ఆ .. ఆ .. కర్మ
ఆ .. ఆ .. కర్మ

పదని పదని పదని గమమప కర్మ
నిసస రిససరిసస దమప కర్మ

పదని పదని పదని గమమప
దపదప రిససరిసస రిసస
దమపమపదప

పదని పదని పదని గమమప
దపదప రిససరిసస రిసస
దమపమపదప

పదని పదని పదని గమమప
దపదప రిససరిసస రిసస
దమపమపదప

నిసస రిసస రిసస 
గమమమపదప


13, జులై 2020, సోమవారం

కనులు కలను పిలిచే పాట లిరిక్స్ - Kanulu Kalanu Piliche Song Lyrics in Telugu - Abbayitho Ammayi (2016) Telugu Songs Lyrics







ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : అబ్బాయితో అమ్మాయి (2016)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : ఇళయరాజా
గానం : హరిచరన్, చిన్మయి












కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే

మేఘాల తేలి నీ చెంతవాలి
మనసా ..... ఓ .. ఓ ..

ఈ చల్లగాలి పాడింది లాలి
తెలుసా .... ఓ .. ఓ ..

కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగ నిలిచే


బదులు రాని పిలుపులాగ
గతము మిగిలినా

విడిచిపోని గురుతులాగ
అడుగు కలపనా

తెలుపలేని తపనలేవో
ఎదని తొలిచినా

మరుపురాని మమతలాగ
ఎదుట నిలవనా

బతుకులోని బరువులన్ని
వదిలి కదిలిపో

కలత తీర కలలు చేరి
వదిగి వదిగిపో

నిదురపో నిదురపో
నిదురలో కలిసిపో

అలసి సొలసి నిదుర నదినా
కునుకు పడవా

కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే


ఎవరు నీవు ఎవరు నేను
ఎవరికెవరులే ...

మధురమైన వరము ఏదో
మనని కలిపెలే ...

చెదిరిపోయి ఎగిరిపోయి
వెలుగు ముగిసినా

నిసిని దాటి దిశలు మారే
ఉదయమవునులే

శిసిరమైన పసిడి పూలు
మరల పూయులే

శిథిలమైన హృదయ వీధి
తిరిగి వెలుగులే

తెలుసుకో తెలుసుకో
మనసునే గెలుచుకో

మనసు గెలిచి తెగువ మరచి
కలలు కనవా ...

కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే

మేఘాల తేలి నీ చెంతవాలి
మనసా ..... ఓ .. ఓ ..

ఈ చల్లగాలి పాడింది లాలి
తెలుసా .... ఓ .. ఓ ..

కనులు కలను పిలిచే
నిదుర తలుపు తెరిచే

మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే 






12, జులై 2020, ఆదివారం

అరెరే మనసా ఇదంతా నిజమా పాట లిరిక్స్ - Arerey Manasa Song Lyrics in Telugu - Falaknuma Das (2019) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : ఫలక్ నుమా దాస్ (2019)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : వివేక్ సాగర్
గానం : సిద్ శ్రీరామ్

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా

తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా

నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది
నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన
తోడే నువ్వే
ఆ' ఊరంతా మహరాజైనా
నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే...

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది
నా వేకువలే
ఆ' ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా

అరెరే మనసా...
ఇదంతా నిజమా...
ఇకపై మనమే...
సగము సగమా...

అరెరే మనసా
(అరెరే మనసా)
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా

అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే
సగము సగమా


11, జులై 2020, శనివారం

కడలల్లె వేచె కనులే పాట లిరిక్స్ - Kadalalle Veche Kanule Song Lyrics in Telugu - Dear Comrade (2019) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి 





చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
గానం : సిద్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే

ఒడిచేరి ఒకటై పోయే

ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే హృదయం ఊగెలే
అధరం అంచులే మధురం కోరెలే

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా

చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా

కాలాలు మారినా మారినా
నీ ధ్యాస మారునా

నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా

విరహం పొంగెలే హృదయం ఊగెలే
అధరం అంచులే మధురం కోరెలే

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే

నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా

నన్నే నన్నే మలిచానే నీవుగా

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం

పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా
నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా

10, జులై 2020, శుక్రవారం

మళ్లీ మళ్లీ రాదాంట ఈ క్షణం పాట లిరిక్స్ - Malli Malli Radaanta Telugu Song Lyrics - Chukkallo Chandrudu (2006) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : చుక్కల్లో చంద్రుడు (2006)
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
సంగీతం : చక్రి
గానం : షాన్, సిద్ధార్థ్


మళ్లీ మళ్లీ రాదాంట ఈ క్షణం
నచ్చినట్టు నువ్వుండగా
యవ్వనం అంటేనే ఓ వరం
తప్పు ఒప్పు తేడాలే లే లేదురా

చిన్నమాటని చెవిన వేయ్యని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే

everybody let's break this body
walk your body with me...

everybody let's break this body
walk your body with me...

నాలాగే నేనుంటాను
నా మది మాటే వింటుంటాను
this is the way i am

నాతోనే నేనుంటాను
నచ్చిన పనినే చేస్తుంటాను
i don't give it down

నవ్వులు రువ్వుతూ
నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు
అంతే చాలురా

అందని పండుని పొందాలి
అంతా ఆనందం
అందిన వెంటనే పంచాలి
ఎంతో సంతోషం
అల్లరి పనులే చేయాలి
అపుడే ఆరోగ్యం

నా సాటి నేనుంటాను
పోటీలోనే ముందుంటాను

కెరటం నాకే ఆదర్శం
పడినా లేస్తాగా
సమరం నీకే ఆహ్వానం
గెలుపే నాదేగా

కష్టం అంటే ఇష్టంగా
కష్టం రాదంటా
నమ్మిందే చేస్తుంటాను
ప్రాణం పెట్టి సాధిస్తాను

everybody let's break this body
walk your body with me...

నవ్వులు రువ్వుతూ
నవ్వును పంచుతు
నాలుగు రోజులు ఉన్నా చాలు
అంతే చాలురా

oh my love i have been taken
that it's all about giving

but life of me is just a part of living
so i was living livinglivinglivingliving

a mistake done i take in to step
taken into step start ahha

walk walk walk walk
hey i just walk with love
i just won a  have fun...
thats right...

చిన్నమాటని చెవిన వేయ్యని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే

everybody let's break this body
walk your body with me...

everybody let's break this body
walk your body with me...

ఆకాశం నీ సరిహద్దు
అవకాశాన్ని అసలోదలొద్దు
సందేహం ఏదీ లేదు 

పోయేటప్పుడు ఏదీ రాదు

స్వేచ్ఛగా మంచిని పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా
చాలు జన్మ ధన్యమే...