ఇక్కడ ఈ పాట చూడండి
చిత్రం : దేవి (1999)
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుమంగళి
హే నీ నవ్వే నాగస్వరమే
నీ నడకే హంసరథమే
నీ కులుకే కళల కనకాంబరమే
నీ ఒడిలో ఒక్కక్షణమే
నా మదిలో స్వర్ణయుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
కలిసిరావే కలల తార
వయసు మీటే ప్రియ సితార
సుధలొలుకు సరిగమ పలికి
పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదసీకి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బుల్లోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతిజల్లు పైటచాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్యారాగం కుచ్చెళ్లమ్మ
మనసారా కోరుకున్న ఓసారైన వచ్చెళ్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జట్టే కావాలి
నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ కులుకే కళల కనకంబరమే
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మదిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
హే.. మాఘమాసం వచ్చినాది నాయుడో
బంతిమొగ్గ విచ్చినాది
అద్దకాల పైట వచ్చి జారుతూ
పెద్ద సిగ్గు తెచ్చినాది
కోరచూపు గుండెల్లోకి
దూసుకెళ్లి కోలోకోలో
కోలాటాలు వేసినాది కొంటెపిల్లడో
మీసకట్టు మీద ఒట్టు
ఆశ పెట్టుకున్న దాన్ని
చెయ్యిపట్టి ఏడకైనా తీసుకెళ్లరో
నీలి నీలి ముంగురులు గాలిలోన గింగిరులు
అందగత్తెలందరికీ నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కుకు కుకు కోయిలమ్మ
ఒక్కొక్క అక్షరాన్నే పట్టీ పట్టీ పాడిందమ్మా
జాబిల్లి చిన్నాబోయి సున్నలాగ మారిపోయి
సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా
ఎన్నో ఎన్నో అందాలన్ని ఏనాడో
నిన్నే చేరి అయినాయే పారాణి
నా నవ్వే నాగస్వరమే
నా నడకే హంసరథమే
నా కులుకే కళల కనకాంబరమే
నా ఒడిలో ఒక్కక్షణమే
నీ మదిలో స్వర్ణయుగమే
నా వలపే వేయి జన్మల వరమే
కలిసిరానా కలల ఆశ .. న న న నా నా
సుధలొలుకు సరిగమ పలికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి