ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : అధినాయకుడు (2012)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : కల్యాణి మాలిక్
గానం : కల్యాణి మాలిక్
చీకటి శిరసును వేకువ వేటుకి
నేలకు రాల్చిన ధినకరుడు
జనగన జంపన జాగృతి దాల్చిన
జాతకుడే అధినాయకుడు
రుధి రాశ్రువు చోరణ ధోరణితో
కదిలొచ్చేను వెల్లువలా
కసి కక్షల కత్తుల వంతెనపై
శివమెత్తగ వచ్చెను సాంబుడిలా
అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో
అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో
శ్రీకర భీకర భూమరమై
రణధీరత నింపిన శ్రామికుడు
భగ భగ హింసను ద్వంశము చేయగ
అడుగిడెరా అధినాయకుడు
విష నాగుల కర్కశ కోరలలో
అణగారిన సీమలలో
రుధిరాక్షర తీరపు దారులలో
మధురాక్షర మంత్రమే ఊపిరిగా
అదిగో అదిగదిగో గెలిచే తెగువదిగో
అదిగో అదిగదిగో జయహో జనమదిగో
జనమతమే తన అభిమతమై
జనపదమే తన దృక్పధమై
శిసిరపు చాయలు తాకే నేలకి
చిగురాసై మొలిచాడు
న్యాయం కొడిగట్టుకుపోయే
కాలం మరుదించగా
దైవం కరుణించగ వచ్చిన
ధైర్యం ఇతడేకదా
అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో
ఉరిమే గళమదిగో అదిగో
అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో
ఉరికే శరమదిగో అదిగో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి