ఇక్కడ ఈ పాటని వినండి
చిత్రం : జాతిరత్నాలు (2021)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : రాథన్
గానం : రామ్ మిర్యాల
చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికలు తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావు అనీ
సిగ్నల్ ఇచ్చే ఆ బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైనులోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్నా జీందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే
హత్తేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాని
లోకంలోన రంగులు పూసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే
చిటికలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే వొటేసావే
బంగ్లా నుండి బస్తీ కి ఫ్లైటేసావే
తీన్మారు చిన్నోడిని డిజే స్టెప్ లు ఆడిస్తివే
నసీబ్ బ్యాడ్ ఉన్నోన్ని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు
ఆఫ్టరాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకీ చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జీలాంటి లైఫులో నువ్వు
ఆనియాన్ ఏసావే
అరెరే గిచ్చేసావే లవ్ డాట్ గిచ్చేసావే
మస్త్ మస్త్ బిర్యానీ లో నీంబూ చెక్కై హల్ చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి