28, జనవరి 2021, గురువారం
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాట లిరిక్స్ - Neeli Neeli Aakasam Iddam Anukunna Song Lyrics in Telugu - 30 Rojullo Preminchadam Ela (2021)
26, జనవరి 2021, మంగళవారం
నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే పాట లిరిక్స్ - Nee Navve Nagaswarame Nee Nadake Hamsaradhame Song Lyrics in Telugu - Devi (1999) Telugu Songs Lyrics
ఇక్కడ ఈ పాట చూడండి
చిత్రం : దేవి (1999)
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుమంగళి
హే నీ నవ్వే నాగస్వరమే
నీ నడకే హంసరథమే
నీ కులుకే కళల కనకాంబరమే
నీ ఒడిలో ఒక్కక్షణమే
నా మదిలో స్వర్ణయుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
కలిసిరావే కలల తార
వయసు మీటే ప్రియ సితార
సుధలొలుకు సరిగమ పలికి
పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదసీకి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బుల్లోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతిజల్లు పైటచాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్యారాగం కుచ్చెళ్లమ్మ
మనసారా కోరుకున్న ఓసారైన వచ్చెళ్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జట్టే కావాలి
నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ కులుకే కళల కనకంబరమే
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మదిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
హే.. మాఘమాసం వచ్చినాది నాయుడో
బంతిమొగ్గ విచ్చినాది
అద్దకాల పైట వచ్చి జారుతూ
పెద్ద సిగ్గు తెచ్చినాది
కోరచూపు గుండెల్లోకి
దూసుకెళ్లి కోలోకోలో
కోలాటాలు వేసినాది కొంటెపిల్లడో
మీసకట్టు మీద ఒట్టు
ఆశ పెట్టుకున్న దాన్ని
చెయ్యిపట్టి ఏడకైనా తీసుకెళ్లరో
నీలి నీలి ముంగురులు గాలిలోన గింగిరులు
అందగత్తెలందరికీ నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కుకు కుకు కోయిలమ్మ
ఒక్కొక్క అక్షరాన్నే పట్టీ పట్టీ పాడిందమ్మా
జాబిల్లి చిన్నాబోయి సున్నలాగ మారిపోయి
సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా
ఎన్నో ఎన్నో అందాలన్ని ఏనాడో
నిన్నే చేరి అయినాయే పారాణి
నా నవ్వే నాగస్వరమే
నా నడకే హంసరథమే
నా కులుకే కళల కనకాంబరమే
నా ఒడిలో ఒక్కక్షణమే
నీ మదిలో స్వర్ణయుగమే
నా వలపే వేయి జన్మల వరమే
కలిసిరానా కలల ఆశ .. న న న నా నా
సుధలొలుకు సరిగమ పలికి
25, జనవరి 2021, సోమవారం
మాటే వినదుగ పాట లిరిక్స్ - Maate Vinadhuga Song Lyrics in Telugu - Taxiwala (2018) Telugu Songs Lyrics
సంగీతం : జేక్స్ బిజోయ్
గానం : సిద్ శ్రీరామ్
మాటే వినదుగ.. మాటే.. మాటే
మాటే వినదుగ.. మాటే.. మాటే
పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమె.. దారులు వేరులె
పయనమె నీ పనిలే..
అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..
మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం
మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం
పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులె
పయనమె నీ పనిలే
అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..
చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే.. బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవ మిగులుంటే.. హో.. హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా..
నీడలా వీడక.. సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రాని.. జేబే ఖాళీ కానీ..
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోనీ
వీడకులే శ్రమ విడువకులే..
తడి ఆరె ఎదపై.. ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా.. కురిసే ఆ వానా..
మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం
మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం
పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనమె నీ పనిలే
అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో.. పరిచయం
అంతలా పరవశం..
రంగు చినుకులే గుండెపై రాలెనా
24, జనవరి 2021, ఆదివారం
పువ్వులకు రంగెయ్యాల పాట లిరిక్స్ - Puvvulaku Rangeyyala Telugu Song Lyrics - Joru (2014) Telugu Songs Lyrics
సాహిత్యం : భీమ్స్
సంగీతం : భీమ్స్
గానం : శ్రేయా ఘోషల్
అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నా
కనురెప్పల మాటున ఉన్నా తన చప్పుడు నీదేనా
చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా
పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్నా
తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా
అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా
ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హా హా
పువ్వులకు రంగెయ్యాలా
చుక్కలకు మెరుపెయ్యాలా
గాలినే చుట్టేయాలా తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాలా
చుక్కలకు మెరుపెయ్యాలా
గాలినే చుట్టేయాలా తేలిపోనా హాయిలోనా
హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా
సంతోషాన్ని నేను ఎలా దాచుకోను
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూటగట్టి ఈవేళా
నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లి దారులన్ని దాటేలా
నేనింక నీదాన్ని అయ్యేలా
పువ్వులకు రంగెయ్యాలా
చుక్కలకు మెరుపెయ్యాలా
గాలినే చుట్టేయాలా తేలిపోనా
మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళి నీకై ముస్తాబవ్వనా
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయమొకటే పరి పరి విదములు లాలించి
ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించి
చేయి చేయి కలపమని
పువ్వులకు రంగెయ్యాలా
చుక్కలకు మెరుపెయ్యాలా
గాలినే చుట్టేయాలా తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాలా
చుక్కలకు మెరుపెయ్యాలా
గాలినే చుట్టేయాలా తేలిపోనా హాయిలోనా
23, జనవరి 2021, శనివారం
ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్ - Undiporaadhey Gunde Needhele Song Lyrics in Telugu - Hushaaru (2018) Telugu Songs Lyrics
సంగీతం : రాథన్
గానం : సిద్ శ్రీరామ్
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూశాకా
మనసే మురిసే ఎగసే అలలాగా
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిముషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
22, జనవరి 2021, శుక్రవారం
అడిగా అడిగా ఎదలో లయనడిగా పాట లిరిక్స్ - Adiga Adiga Yadalo Layanadiga Song Lyrics in Telugu - Ninnu Kori (2017) Telugu Songs Lyrics
సాహిత్యం : శ్రీజో
సంగీతం : గోపీ సుందర్
గానం : సిద్ శ్రీరామ్
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేనీ గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
21, జనవరి 2021, గురువారం
చీకటి శిరసును వేకువ వేటుకి పాట లిరిక్స్ - Chikati Sirasunu Vekuva Vetuki Telugu Song Lyrics - Adhinayakdu (2012) Telugu Songs Lyrics
20, జనవరి 2021, బుధవారం
కలుసుకుందామ ఇద్దరం కలుసుకుందామ పాట లిరిక్స్ - Kalusukundama Iddaram Kalusukundama Song Lyrics in Telugu - Nee Manasu Naku Telusu (2002) Telugu Songs Lyrics
19, జనవరి 2021, మంగళవారం
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే పాట లిరిక్స్ - Chinni Chinni Chinukulu Song Lyrics in Telugu - Rakshasudu (2019) Telugu Songs Lyrics
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : జిబ్రన్
గానం : సిద్ శ్రీరామ్
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే
నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
వెతుకుతున్నానే నిన్న కలనే
రేపటి ఊహకే వెళ్ళలేనే
ఈ చిన్ని జ్ఞాపకాల వర్షాలలో
నా గమ్యమేమిటంటే ఏవైపు చూపాలిలే
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే
నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
18, జనవరి 2021, సోమవారం
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే పాట లిరిక్స్ - Janma Needele Maru Janma Neekele Telugu Song Lyrics - Premisthe (2005) Telugu Songs Lyrics
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : జాషువా శ్రీధర్
గానం : హరిచరణ్
జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే.....
జతను విడిచావో.....చితికి పోతానే
ప్రియతమా.... ప్రణయమా...
కుమలకే...... ప్రాణమా.......
అడుగు నీతోనే
జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే......
జతను విడిచావో...... చితికి పోతానే
కన్నుల భాదను కన్నుల నీరే... తెలుపును
వలచిన హృదయము తెలుపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే....
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా
గూడు మన ప్రేమకు ఓటమీ రానే రాదు
ప్రతి నదికి మలుపులు తద్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మినుగురులే ఒడి కిరణం
తల్లిని తండ్రిని కాదని ప్రేమే....
కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా
గుండెపై నీవుగా వాలిన ప్రేమలో.....
ఎదురుగా పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేన్నిలవుతా అవికాచే మంటనవుతా
నిదురించే కంట్లో నేనే పాపల్లె మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే...
నేనంటే నేనే కాదు
నువ్వులేక నేనే లేను
నీ కంటి రెప్పల్లె ఉంటా....
జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే..... జతను విడిచావో.....
ప్రియతమా.... ప్రణయమా...
కుమలకే...... ప్రాణమా....... అడుగు నీతోనే
జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే...... జతను విడిచావో...... చితికి పోతావే
17, జనవరి 2021, ఆదివారం
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో పాట లిరిక్స్ - Nee Navvu Cheppindi Naatho Nenevvaro Emito Song Lyrics in Telugu - Antham (1990) Telugu Songs Lyrics
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఆర్.డి.బర్మన్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో
హో లలాలల హో లలాలల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
హో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ
నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని
నీ సిగ్గు నా జీవితాన తొలిముద్దు పెడుతుందని
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
హా లలాలల హా లలాలల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో
16, జనవరి 2021, శనివారం
ఒకే ఒక లోకం నువ్వే పాట లిరిక్స్ - Okey Oka Lokam Nuvve Song Lyrics in Telugu - Sasi (2021) Telugu Songs Lyrics
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : అరుణ్ చిలువేరు
గానం : సిద్ శ్రీరామ్,సునీత
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా
ఓ ..కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా
నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో మంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే
ఎండే నీకు తాకిందంటే
చెమటే నాకు పట్టెనే
చలే నిన్ను చేరిందంటే
వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా
15, జనవరి 2021, శుక్రవారం
ఆకాశం హద్దుగా సాగిపో సోదరా పాట లిరిక్స్ - Aakasam Hadduga Saagipo Sodara Song Lyrics in Telugu - Saroja (2010) Telugu Songs Lyrics
14, జనవరి 2021, గురువారం
చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే పాట లిరిక్స్ - Chitti Nee Navvante Lakshmi Patase Telugu Song Lyrics - Jathi Ratnalu (2021) Telugu Songs Lyrics
ఇక్కడ ఈ పాటని వినండి
చిత్రం : జాతిరత్నాలు (2021)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : రాథన్
గానం : రామ్ మిర్యాల
చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికలు తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావు అనీ
సిగ్నల్ ఇచ్చే ఆ బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైనులోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్నా జీందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే
హత్తేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాని
లోకంలోన రంగులు పూసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే
చిటికలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే వొటేసావే
బంగ్లా నుండి బస్తీ కి ఫ్లైటేసావే
తీన్మారు చిన్నోడిని డిజే స్టెప్ లు ఆడిస్తివే
నసీబ్ బ్యాడ్ ఉన్నోన్ని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు
ఆఫ్టరాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకీ చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జీలాంటి లైఫులో నువ్వు
ఆనియాన్ ఏసావే
అరెరే గిచ్చేసావే లవ్ డాట్ గిచ్చేసావే
మస్త్ మస్త్ బిర్యానీ లో నీంబూ చెక్కై హల్ చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే
1, జనవరి 2021, శుక్రవారం
కమ్మని కలలకు ఆహ్వానం పాట లిరిక్స్ - Kammani Kalalaku Aahwanam Song Lyrics in Telugu - Priya O Priya (1997) Telugu Songs Lyrics
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : కోటి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం
హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
చిరునవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవరాగం
హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్
కమ్మని కల్లలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
హ్యాపీ న్యూఇయర్
ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్న మాట
నా కోసమే వస్తావని
కట్టానులే ఓ కలల కోట
అణువణువు నిన్ను తడిమే
చూపులకి ఎంత మహిమో
అణుక్షణము నిన్ను పిలిచే
పెదవులకి ఎంత సుఖమో
ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
హూలల హూలల హులలా హులలల్లలా
హూలల హూలల హులలా హులలల్లలా
ఓ నేస్తమా ఓ నేస్తమా
చిరు గాలితో చిరు గాలితో
కబురంపినా కబురంపినా నేనాగలేక
ఓ జానేమన్ ఓ జానేమన్
మేడిన్ హేవెన్ మేడిన్ హేవెన్
రాసేయనా రాసేయనా
ఓ ప్రేమ లేక
విరహమనే మంచు తెరలో
చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చ బడితే
కరుగునులే కన్నె బిడియం
ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా