నాకు ఈ పాటంటే చాలా చాలా ఇష్టం 2016 లో ఈ పాట విడుదల అయినపుడు
నా మొబైల్ లో ఇదొక్కటే వినేవాడిని ఏ.ఆర్ .రెహ్మాన్ గారి సంగీత మాయాజాలం
ఈ పాటని వేరే స్థాయికి తీసుకెళ్లింది ఇంక ఈ పాట విజువల్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి
అలాంటి అద్భుతమైన పాట ఈరోజు మన నేను నా పాట లో
ఈ పాటని ఇక్కడ వినండి
ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)
సాహిత్యం : శ్రీజో
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరామ్, ఏడికే
కాలం నేడిలా మారెనే (మారెనే)
పరుగులు తీసెనే (తీసెనే , తీసెనే)
హృదయం వేగం వీడదే
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా
స్నేహంగా తోడున్న నీవే
ఇక గుండెలో ఇలా
నడిచే క్షణమే
ఎద సడి ఆగే ఊపిరి పాడే
పెదవిని వీడె పదమొక కవితై
మది నీ వశమై నువ్వు నా సగమై
ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళ
పసివాడై కెరటాలే ఈ క్షణం
చూడనా... చూడనా
ఎగిరే నింగి దాక ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం
ఓ కాలన్నే కాజేసె కళ్ళ కౌగిళ్లో కరిగే కలలే ...
ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఊపిరే పోసే
ఇది తొలి ప్రణయం మనం ఆపిన ఆగదే ఎన్నడూ వీడదే
వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే
మనసే (మనసే) మరువై (మరువై)
నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే
లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే
ఇది వరమే
మనసుని తరిమే చెలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమై
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎరవేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
ఏ అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడెలే,
మనసిక పరుగే ఆపదే
వెళ్లిపోమాకే
మనసిక పరుగే ఆపదే
వదిలెళ్లి పోమాకే
నీలో నాలో నీలో నాలో నీలో నాలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి