12, మే 2020, మంగళవారం

ఒప్పుకోని ఒక్క క్షణమేదో పాట లిరిక్స్ - Oppukoni Okka Kshanamedo Telugu Song Lyrics - Vedhana (2011) Private Telugu Album









అల్బమ్ : వేదన (2011)
సాహిత్యం : అవిష్కర్
సంగీతం : అవిష్కర్
గానం : కారుణ్య

ఓహో.. ఓ.. ఓ..
ఓహో .. ఓ.. ఓ..

ఒప్పుకోని ఒక్క క్షణమేదో దారి
చూపునంటా గుండె లోతులలో
తప్పు నీదో నాదో తెలియకనే
సాగుతుంది ఇలా
నిన్న మొన్న నాకు పీడ కలవై
ముంచి ఎత్తినావే నీటి అలలాగ
ఎప్పుడైతే నీకు తెలిసోచ్చేననీ
మొదలాయో నా పయనం

ఎండమావి కెన్నడో చెప్పానే
వెంటవచ్చే నీడ నాకెందుకని
బదులుగ తెలిపింద్దేంటంటే
తొడులేని ప్రాణమే దేనికని

కనులై కలిపిందేవరంటా
కధగా మిగిలిందేవరంట
నువు కాద నువు కాద

ప్రేమను రెండుగ మలిచావే
మనసును ముక్కలు చేసావే
తడి కనులే మిగిలాక

నీ రూపు రేఖల్లో ఏ దేవతనే
మురిపిస్తున్నా వరమివ్వ
వలదని నిన్నే వీక్షిస్తున్నా

మనసంటు నీకుందని
నా ప్రేమను నీకే వదిలేసా
చెరిసగము అనుకొని
నీవు నిలిపావు కదా

బ్రతికుండి నాకు నేను
కధలో కన్నీరయ్యాను
నిమిషం యుగంగ కాలం
గడిపించావు గా .....
దూరంలో ఎగిరే చిలుకా
క్షేమంగా తిరిగొస్తావ
తపియించే ప్రేయసి కోసం
బలికాకేప్పుడు
కనులతో మురిపించావ
కనుపాపగ నన్నే మిగిలించావ
నను నేనే చూస్తున్నాన
నాకు నీనే అర్దం కానా....

ప్రేమకు జాలే లేదు అనీ
చరితలు చెప్పేసెయ్ ఎపుడో
వినలేదే తప్పు నాదే
ఎవరో ఎందుకు వస్తారో
విడిచి ఎందుకు వెళతారో
విధి రాతే సరికాదే

అది తప్పు ఇది తప్పు అని నిందించే
మనసుకు తెలియదు గా
నా గుండె లోతుల్లో నువు నిండావు అనీ
నువు నడిచే దారుల్లోన శిలగా స్పందిస్తూ ఉన్నా
కదిలేటి కాలం మనకిక సాక్ష్యై అయ్యుందా

లోకంలో ఎందరున్నా నా లోకమంత నువ్వే
నా చివరి శ్వాసే నీకు కానుక కావున.. ఆ....
లోకంలో ఎందరున్నా నా లోకమంత నువ్వే
నా చివరి శ్వాసే నీకు కానుక కావున.. ఆ....

ముల్లులాంటి మనసే నీదా
నా హృదయం మొత్తం గుచ్చేస్తావ
నువు నాకు ఎదురోస్తున్నా
ఇక నే నిన్నే చూడనుగా..

ఆ..అ...ఆ...ఆ...

తనన తానన తానన
తాన తానన తానన
తననాన తనన
తనన తాన తానన
తనన తాన నానన
తాననా తననాన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి