ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : తొలివలపు (2001)
సాహిత్యం : శ్రీహర్ష
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి
వందనం... వందనం
ఓ చెలి వందనం..
విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా
జీవితం నా జీవితం
నీకిదే.. అంకితం
వేదనలో వేడుకనే నేను కానా
చీకటిలో దీపంలా నేను రానా
ఆమని ఇదిగో వచ్చెనమ్మా
ప్రేమని మనకి తెచ్చెనమ్మా
భూమిని స్వరం చేసేనమ్మా
కోయిల కంఠం విప్పెనమ్మా
కమ్మని పాటలు పాడెనమ్మా
కమ్మని పంట పండెనమ్మా
కల్లకపటం ఎరుగని నిన్ను
ఎల్లకాలం ప్రేమిస్తా
మళ్లీ గాలి తరగల తోటి
చల్లగా నిను సేవిస్తా
కలతంటు నీకోస్తే కరిగి నీరవుతా
వందనం వందనం ఓ చెలి వందనం
బతుకంతా బాసటగా నేను లేనా
చితి వరకు నెచ్చెలిగా తోడు కానా
అందం చందం నువ్వే అయితే
నేనే దిష్టి చుక్కై పోతా
వీడని గుర్తు మచ్చే అవుతా
సూర్యుడిలాగ నువ్వొస్తుంటే తూరుపూ దిక్కు
నేనే అవుతా తొలివలపులకే వేదిక నవుతా
దేవుడు ఎదురై నను కరునిస్తే
వరము నీకై అడిగేస్తా
చీకటైనా వెన్నెల అయినా నీకు నేనై అడుగేస్తా
యముడైనా ఎదురోస్తే నేను ఎదురిస్తా
వందనం వందనం ఓ చెలి వందనం
విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి