చిత్రం : గాయం 2 (2011)
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఇళయరాజా
గానం : శ్రీరామ్ పార్థసారథి, శష్వతి
అందాల లోకం చెంత వాలుతుందా
చిన్నారి ఆశే చిందులెయ్యమందా
కుదుటేపడని కెరటంలా కొత్త సంతోషం
ఎదనే తడిమి ఎగసిందా నేడు నీ కోసం
అందాల లోకం చెంత వాలుతోందా
చిన్నారి ఆశే చిందుల్లేస్తోందా
ఒకరికొకరైన ఒడిలోన
వరమై ఎదిగే పసికూన
చిలిపి సరదాలు ఆగేనా
వయసే పిలిచే సమయాన
ఓ ఓ వెయ్యేళ్ళకి వేరైపోదే
వేంటాడిన ఈ పాశం
ఒక్కో క్షణం నాదంటోందే
ఉప్పొంగిన ఉల్లాసం
ఇప్పుడే ఎదలో విరిసిందా
నింగి హరివిల్లు
మమతే విడిపోనంటుందా
నిండు నూరేళ్ళు
అందాల లోకం చెంత వాలుతుందా
ఓ ఓ చిన్నారి ఆశ చిందులెయ్యమందా
ఎవరి ఎదలోన కలతున్నా
తనదే అనదా ఆ గాయం
చివరి కన్నీటి తడి తుడిచే
చెలిమే అవదా చిరుసాయం
ఓ ఓ ఆకాశమే అమ్మైయిందా
అన్నీ తనే అందిస్తూ
సావసమే నాన్నైయిందా
గమ్యాన్నిలా చూపిస్తూ
అలలై పొంగే అనురాగం
అల్లుకుంటుందా
నిజమై నిలిచే ప్రతి స్వప్నం
నేస్తమవుతుందా
అందాల లోకం చెంత వాలుతోందా
చిన్నారి ఆశే చిందుల్లేయ్యమందా
కుదుటేపడని కెరటంలా కొత్త సంతోషం
ఎదనే తడిమి ఎగసిందా నేడు నీ కోసం
నన్నా న నాన నన్న నాన నాన
నన్నా న నాన ఓ హో హో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి