21, మే 2021, శుక్రవారం

వేణుశ్రీకాంత్ గారికి అంజలి ఘటిస్తూ ..........

నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నాకు వేణు గారితో వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేకపోయిన, ఆయన బ్లాగుని నేను ఒక సంవత్సరం నుంచి అనుసరిస్తున్నాను. ప్రతిరోజు ఆయన పోస్ట్ చేసే తెలుగు పాటల టపాలకు పెద్ద అభిమానిని, ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా 6 సంవత్సరాల నుంచి ఒక ప్రవాసంలా సాగుతున్న ఈ సాహితి ప్రక్రియ అసామాన్యమైనది. ఆయనను కచ్చితంగా కలవాలని కోరుకున్నాను కానీ. ఇలా ఆయన అందరినీ వదిలి వెళతారని అనుకోలేదు.


ఇంట్లో మనిషి దూరమైనంత బాధ కలుగుతుంది మనసంతా,ఏప్రిల్ 26 తరువాత ఆయన బ్లాగు నుంచి టపాలు రావటం ఆగిపోయాయి.ఏమన్నా అర్జెంట్ పని ఉండి పోస్ట్ చేయలేదు అనుకున్నా కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు.

ఆయన లేని లోటు తెలుగు బ్లాగు లోకానికి కచ్చితంగా ఒక వెలితి అనే చెప్పాలి.

బాధతప్త హృదయంతో
మీ బ్లాగుని అనుసరించే
ఒక అభిమాని.,




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి