31, మే 2021, సోమవారం
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట లిరిక్స్ - Inkem Inkem Inkem Kaavaale Song Lyrics in Telugu - Geetha Govindam (2018) Telugu Songs Lyrics
30, మే 2021, ఆదివారం
ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ పాట లిరిక్స్ - Ennenno Varnaalu Vaalaayi Chuttu Song Lyrics in Telugu - Raahu (2010) Telugu Songs Lyrics
29, మే 2021, శనివారం
నీ పరిచయముతో నా మదిని గెలిచా పాట లిరిక్స్ - Nee Parichayamutho Naa Madhini Gelichaa Song Lyrics in Telugu - Choosi Choodamgane (2020) Telugu Songs Lyrics
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : అనంత్ శ్రీరామ్
గానం : సిద్ శ్రీరామ్
నీ పరిచయముతో
నా మదిని గెలిచా
నీ పలకరింపుతో
నా దిశను మార్చినా
అడుగు నీతో కలిపి
అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా
విడిపడి నీకై నడిచా
నీ పరిచయముతో
నా మదిని గెలిచా
ఏ గతము ఎదురవదిక
నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక
నీ పిలుపే వినపడితే
నాలోని లోతు చూపిన
నీ పరిచయముతో
నిలువునా నే వెలిగి
వెలుగులలో నే మునిగా
పదనిసలేవో తడిమి
పరవశమై పైకెగిరా
నీ చెలిమే ప్రతిక్షణముని
నా వరకు నడిపినది
నీ మహిమే ప్రతి మలుపుని
తీరముగ మలిచినది
నాలోని నన్ను చేర్చిన
నీ పరిచయముతో
నీ పరిచయముతో
నా కలని కలిసా
నీ వెలుగు వానలో
నే తడిసి పోయినా
అడుగు నీతో కలిపి
అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా
విడిపడి నీకై నడిచా
చివరి దాకా నిలిచే
హృదయమునే నే కలిసా
చెరగని ప్రేమై మిగిలే
మనసుని నేనై మురిసా
28, మే 2021, శుక్రవారం
ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పాట లిరిక్స్ - Inthena Inthena Premante Inthena Song Lyrics in Telugu - Suryakantham (2019) Telugu Songs Lyrics
సంగీతం : మార్క్ కె. రాబిన్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : సిద్ శ్రీరామ్
ఇంతేనా ఇంతేనా
పడిన దాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే
నిదుర లేదు
కుదురు లేదు
నిమిషమైనా నాకె
కదల లేను
వదలలేను
మాయ నీదేనా
మాటలైనా రానే రావు
పెదవి దాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా
నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం
సరిపోయేనా దేహం
నీతో సావాసం
నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయే
కన్నులై వెలిగే
దూరమంత తీరిపోయే
మనసు తనువును తాకితే
ఎదురు చూడని స్నేహమే
ఎదురు వచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే
వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా
ఆ మాయలో నేను ఉన్నా
ఎంత చూస్తున్నా చాల లేదమ్మా
నా కళ్ళలో దాగే పొవా
ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా
పడిన దాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే
నిదుర లేదు కుదురు లేదు
నిమిషమైనా నాకే
కదల లేను వదలలేను
మాయ నీదేనా
మాటలైనా రానే రావు పెదవి దాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంత తీరిపోయే
మనసు తనువును తాకితే
27, మే 2021, గురువారం
వెన్నెలా ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం పాట లిరిక్స్ - Vennela O Vennela Song Lyrics in Telugu - Neevevaro (2018) Telugu Songs Lyrics
సంగీతం : ప్రసన్
సాహిత్యం : శ్రీజో
గానం : సిద్ శ్రీరామ్
వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా
ఓ ఓ ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం
ఒక మాయ నీ పరిచయం …
ఓ ఓ ఓ ఓ
వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా
మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ
ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే
వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!
వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా
ఓ ఓ ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం
ఒక మాయ నీ పరిచయం
ఓ ఓ ఓ ఓ
వెన్నెలా ...
26, మే 2021, బుధవారం
ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా పాట లిరిక్స్ - Priyathama Tiruguleni Soundaryama Telugu Song Lyrics - Ullasamga Utsahamga (2008) Telugu Songs Lyrics
25, మే 2021, మంగళవారం
ధీవరా! ప్రసర శౌర్య భార! పాట లిరిక్స్ - Dheevara Prasara Sourya Bhaara Telugu Song Lyrics - Baahubali (2015) Telugu Songs Lyrics
24, మే 2021, సోమవారం
పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే పాట లిరిక్స్ - Pacchani Kanulara Okka Pallavi Padarate Song Lyrics in Telugu - Samurai (2004) Telugu Songs Lyrics
చిత్రం : సమురాయ్ (2004)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : హ్యరీస్ జయరాజ్
గానం : టిప్పు
23, మే 2021, ఆదివారం
ఆమని ఋతువు వచ్చినదే పాట లిరిక్స్ - Aamani Ruthuvu Vacchinade Song Lyrics in Telugu - Jodha Akbar (2006) Telugu Songs Lyrics
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట
ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట
వేదనలే రగిలేనె క్రోధనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
చేరువనున్న చేరదురా ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మానడుమా ఉన్నదే
ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట
గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచట బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం
ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతొ వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట
22, మే 2021, శనివారం
హద్దే లేని ఆనందాన పాట లిరిక్స్ - Hadde Leni Aanandaana Telugu Song Lyrics - Evvariki Cheppoddu (2019) Telugu Lyrics
చిత్రం : ఎవ్వరికీ చెప్పొద్దు (2019)
సాహిత్యం : వాసు వలబోజు
సంగీతం : శంకర్ శర్మ
గానం : యాజిన్ నిజార్, సమీరా భరద్వాజ్
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
భూకంపం వస్తే రాని
భూగోళం పోతే పోనీ
ఈరోజు ఈ సంతోషాన్ని
ఆపే వీలుందా
అయ్యేది అయితే కాని
వందేళ్ల ఆనందాన్ని
పొందేద్దాం రావే మనసా
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
కడలి తెగిన వేగమిది
పిడుగు పడిన ఆగదిది
కనని వినని వేడుకిది
కల దొరికినది
నడక పరుగు నేర్చినది
అరుపోక పిలుపైన మది
ఎగసి పడిన ఉప్పెనలా
వయసురికినది
మొదటి అడుగు ఈరోజే
నను అడగక సాగిందా
పడుచుతనము మంచల్లే
కరిగిన కథ నాదా ఇది నిజమా
ఇలా ఏలా ఇలా ఎలా ....
అడుగు కదలని నా చిరు ఆశకు
పరుగు కలదని నేర్పిన నేస్తమా
కలకు దొరకని సంబరమే ఇది
క్షణము క్షణమోక పండుగ అయినది
ఏన్నో ఏన్నో అద్భుతాల్ని
చూపిస్తా నీ వెంట రాని
నా కన్నుల్తో చూడు నీ కల
ఆశే ఉంటే కోరుకోని
ఆశ నాతో తీరిపోని
గుండెల్లోనే దాచేస్తే ఎలా
ఆపే వీలే లేని
హద్దే లేని ఆనందాన
నన్నే నేనే నమ్మే
మాటే లేదు ఈ మైకాన
భూకంపం వస్తే రాని
భూగోళం పోతే పోనీ
ఈరోజు ఈ సంతోషాన్ని
ఆపే వీలుందా
అయ్యేది అయితే కాని
వందేళ్ల ఆనందాన్ని
పొందేద్దాం రావే మనసా
21, మే 2021, శుక్రవారం
వేణుశ్రీకాంత్ గారికి అంజలి ఘటిస్తూ ..........
నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నాకు వేణు గారితో వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేకపోయిన, ఆయన బ్లాగుని నేను ఒక సంవత్సరం నుంచి అనుసరిస్తున్నాను. ప్రతిరోజు ఆయన పోస్ట్ చేసే తెలుగు పాటల టపాలకు పెద్ద అభిమానిని, ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా 6 సంవత్సరాల నుంచి ఒక ప్రవాసంలా సాగుతున్న ఈ సాహితి ప్రక్రియ అసామాన్యమైనది. ఆయనను కచ్చితంగా కలవాలని కోరుకున్నాను కానీ. ఇలా ఆయన అందరినీ వదిలి వెళతారని అనుకోలేదు.
ఇంట్లో మనిషి దూరమైనంత బాధ కలుగుతుంది మనసంతా,ఏప్రిల్ 26 తరువాత ఆయన బ్లాగు నుంచి టపాలు రావటం ఆగిపోయాయి.ఏమన్నా అర్జెంట్ పని ఉండి పోస్ట్ చేయలేదు అనుకున్నా కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు.
ఆయన లేని లోటు తెలుగు బ్లాగు లోకానికి కచ్చితంగా ఒక వెలితి అనే చెప్పాలి.
బాధతప్త హృదయంతో
మీ బ్లాగుని అనుసరించే
ఒక అభిమాని.,
13, మే 2021, గురువారం
అందాల లోకం చెంత వాలుతుందా పాట లిరిక్స్ - Andaala Lokam Chentha Vaaluthundha Telugu Song Lyrics - Gaayam - 2 (2011) Telugu Lyrics