8, ఆగస్టు 2020, శనివారం

ఎవరో ఒకరు ఎపుడో అపుడు పాట లిరిక్స్ - Evaro Okaru Epudo Apudu Song Lyrics in Telugu - Anukuram (1993) Telugu Song Lyrics











చిత్రం : అంకురం (1993)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : హంసలేఖ

గానం : చిత్ర, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం






ఎవరో ఒకరు ఎపుడో అపుడు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా

అటో ఇటో ఎటో వైపు


అటో ఇటో ఎటో వైపు


ఆ .. ఆ .. ఆ .. ఆ ..


మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ

వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా

అనుకుని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా 


మొదటి చినుకు సూటిగా దూకిరానిదే

మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే

వానధార రాదుగా నేలదారికీ

ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



చెదరకపోదుగా చిక్కని చీకటి

మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి

దానికి లెక్కలేదు కాళరాతిరీ


పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ

రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ

సాగలేక ఆగితే దారి తరుగునా?

జాలిచూపి తీరమే దరికి చేరునా 


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



యుగములు సాగినా నింగిని తాకక

ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా

ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా


ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే

అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా

అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా

నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి