చిత్రం : కధ (2009)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ఎస్.కె.బాలచందర్
పాడినవారు : నరేష్ అయ్యర్
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది
నే ఒంటరి అనే మాటని అంతమే చేసినది
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఉలుకూ పలుకూ అసలు ఎరుగని
మనసుని ఉసిగొలిపినదా ఆ అందం
ఉరుకు పరుగు అవి తెలియని
తలపుని తెగ తరిమినదా పాపం
నీలాల నింగి తెరపైన గీసుకున్నాన
ఆమె రూపం
జగమంత కాగితం చేసి
రాసుకున్నాన ప్రేమ గీతం
ఏ వేళ్లలో ఎటేపెల్లినా ఎదురుగా
కనపడుతు
ఆ పాటనే ప్రతి అక్షరం వదలక పలికినది
అదిగో అదిగో ఆ అడుగుల సడి విని
కదలదు కదలిక రాధ
అపుడే అకడే ఆ పెదవుల నగవుకి
ఎదలను బడలిక పోదా
సంతోషం నీడలా మారి
నడచి వస్తోంది అమె వెంట
అనందం పాపలా చేరి
అడుకుంటోంది అమె కంట
నా రేయి కీ తనే వెకువై
వెలుగునే ఇచ్చినది
ఈ జన్మలో మరో జన్మనే
మరుక్షణం చూపినది
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది
నే ఒంటరి అనే మాటకి అంతమే చేసినది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి