23, ఏప్రిల్ 2020, గురువారం
22, ఏప్రిల్ 2020, బుధవారం
టక టక టక టక ఎవరో పాట లిరిక్స్ - Thaka Thaka Thaka Telugu Song Lyrics - Katha (2009) Telugu Songs Lyrics
చిత్రం : కధ (2009)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ఎస్.కె.బాలచందర్
పాడినవారు : నరేష్ అయ్యర్
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది
నే ఒంటరి అనే మాటని అంతమే చేసినది
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఉలుకూ పలుకూ అసలు ఎరుగని
మనసుని ఉసిగొలిపినదా ఆ అందం
ఉరుకు పరుగు అవి తెలియని
తలపుని తెగ తరిమినదా పాపం
నీలాల నింగి తెరపైన గీసుకున్నాన
ఆమె రూపం
జగమంత కాగితం చేసి
రాసుకున్నాన ప్రేమ గీతం
ఏ వేళ్లలో ఎటేపెల్లినా ఎదురుగా
కనపడుతు
ఆ పాటనే ప్రతి అక్షరం వదలక పలికినది
అదిగో అదిగో ఆ అడుగుల సడి విని
కదలదు కదలిక రాధ
అపుడే అకడే ఆ పెదవుల నగవుకి
ఎదలను బడలిక పోదా
సంతోషం నీడలా మారి
నడచి వస్తోంది అమె వెంట
అనందం పాపలా చేరి
అడుకుంటోంది అమె కంట
నా రేయి కీ తనే వెకువై
వెలుగునే ఇచ్చినది
ఈ జన్మలో మరో జన్మనే
మరుక్షణం చూపినది
టక టక టక టక ఎవరో
నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది
నే ఒంటరి అనే మాటకి అంతమే చేసినది
21, ఏప్రిల్ 2020, మంగళవారం
నా మాట
తెలుగు బ్లాగ్ లోకానికి నమస్కారం ,
సంగీతం వినటం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి వాళ్ళల్లో నేను ఒకడ్ని చిన్నప్పటినుంచి సినిమాలు చూడటం ఎంతో ఇష్టం ఆ తర్వాత వాటిలోని పాటలు వినటం ఏదయినా పాట విపరీతంగా నచ్చితే చెవులు చిల్లులు పడేలా వినేవాడ్ని
ఇప్పుడు ఈ బ్లాగ్ పెట్టడానికి ముఖ్య కారణం ,
ఇప్పటికే మనకి సాహిత్యానికి సంబంధించి తెలుగు బాషా లో చాల బ్లాగులు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు నేను కొత్తగా పెట్టి ఉద్ధరించేది ఏముంది ఏమి లేదు కానీ కొన్ని సార్లు నాకు ఇష్టమైన లేదా ఏదయినా తక్కువ ప్రాచుర్యం పొందిన పాటల సాహిత్యం అసలు నాకు దొరకటం లేదు ఒకవేళ దొరికిన అది ఆంగ్ల బాషా లో ఉంటుంది అందుకని అలాంటి దొరకని పాటలను అందిచటం కోసమే ఈ బ్లాగ్ ని పెట్టడం జరిగింది ఇంకా అప్పుడుడప్పుడు కొత్త పాటలు మరియు నాకు నచ్చిన చిత్రాల నుంచి ఇష్టమైన పాటల సాహిత్యాన్ని అందిస్తాను
నేను పోస్ట్ చేసే పాటల్లో తప్పులు ఉంటే దయుంచి మన్నించగలరు
వాటిని కామెంట్ల రూపంలో నాకు తెలియపరచండి
తెలుగు బాషా వర్ధిల్లాలి !
తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి !
ధన్యవాదాలు !!!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)