3, జనవరి 2022, సోమవారం

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా పాట లిరిక్స్ - Evaraina Epudaina Sarigaa Gamaninchara Song Lyrics in Telugu - Aanandam (2001) Telugu Songs Lyrics









చిత్రం : ఆనందం(2001)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ప్రతాప్, చిత్ర

 


ఓఓఓఓఓఓ...ఓఓఓఓఓఓఓ..

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా

చలిచెర అసలెప్పుడు వదిలిందో

ఆణువణువూ మురిసేలా

చిగురాశలు మెరిసేలా

తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

 

చూస్తూనే ఎక్కడి నుంచో

చైత్రం కదిలొస్తుంది

పొగమంచును పోపొమ్మంటూ

తరిమేస్తుంది

నేలంతా రంగులు తొడిగి

సరికొత్తగా తోస్తుంది

తన రూపం తానే చూసి పులకిస్తుంది

ఋతువెప్పుడు మారిందో

బ్రతుకెప్పుడు విరిసిందో

మనసెప్పుడు వలపుల వనమైందో

 

ఎవరైనా ఎపుడైనా

సరిగా గమనించారా

చలిచెర అసలెప్పుడు వదిలిందో

ఆణువణువూ మురిసేలా

చిగురాశలు మెరిసేలా

తోలి శకునం ఎప్పుడు ఎదురైందో 

 

దిరనననన దిరదిరనా.. దిరనననన దిరనన దిరననా..

దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా.. 

దిరనననన దిరదిరనా.. దిరనననన దిరనన దిరననా..

దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా.. 

దిరనననన దిరనన దిరనన 

దిరనననన దిరనన దిరదిరనా 

 

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా

నడిరాతిరి తొలివేకువ రేఖ

నిదురించే రెప్పలపై

ఉదయాలను చిత్రించి

ఒక చల్లని మది పంపిన లేఖ

 

గగనాన్ని నేలని కలిపే

వీలుందని చూపేలా

ఈ వింతల వంతెన

ఇంకా ఎక్కడిదాకా

చూసేందుకు అచ్చంగా

మన భాషే అనిపిస్తున్నా

అక్షరము అర్ధం కాని ఈ విధి రాత

కన్నులకే కనబడని

ఈ మమతల మధురిమతో

హృదయాలను కలిపే శుభలేఖ

 

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా

నడిరాతిరి తొలివేకువ రేఖ

నిదురించే రెప్పలపై

ఉదయాలను చిత్రించి

ఒక చల్లని మది పంపిన లేఖ 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి