30, జూన్ 2021, బుధవారం

ఏంటి ప్రేమ అసలేంటీ ప్రేమ పాట లిరిక్స్ - బాలు గారు చివరిగా ఆలపించిన గీతం - Enti Ee Prema Asalenti Prema Song Lyrics in Telugu - Teeram (2021) Telugu Songs Lyrics





బాలు గారు మన మధ్య లేరంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను, మనం వినే  ప్రతి పాటలో ఆయన  బ్రతికే ఉన్నారు .బాలు గారి  జన్మదినాన్ని పురస్కరించుకుని (జూన్ 4 ) ఈ నెల మొత్తం ఆయన పాటలను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాడిన ప్రతి ఒక్క పాట సాహిత్యాన్ని  ఈ బ్లాగ్ లో పొందుపరచటానికి ప్రయత్నిస్తాను.









చిత్రం : తీరం (2021)
సాహిత్యం : అనిల్ ఐనమడుగు
సంగీతం : ప్రశాంత్ బీజే
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం





నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ

ఓ క్షణమే మురిపిస్తోంది మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ

కనులపై కల అవుతోంది కునుకే రానీకుంది
ఏకాంతం విలపిస్తోంది తన కాంతి కావాలనంది
తోడుగా తను నడిచోస్తుంటే వాన నన్ను తడిపేస్తోంది
గొడుగు నన్ను వదిలేస్తానంది నా నీడ నన్ను విడిచింది

నిన్నటి నన్నే చంపేస్తోంది నన్నే కొత్తగా చూపిస్తోంది
గుండె చప్పుడే ప్రేమగా మారింది
తన ఊసు మానితే ఆడను అంటోంది

నిరీక్షణలో నిలబెడుతోంది ప్రతీక్షణం తనకై చూస్తోంది
కన్నీరే భయపెడుతోంది తనుంటే నే రానంటుంది

స్పర్శతో నను కదిలిస్తుంటే మనసు మాట విననంటోంది
హద్దులను దాటేయ్ అంటోంది పెదవి జారి నను తాకింది

నా యదలో అలజడి రేపేస్తోంది
నా వ్యధనే బయటకు తోసేస్తోంది

నా కధలో మలుపులు తెచ్చేసింది
అణువణువున ప్రేమను నింపేసింది

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ

ఓ క్షణమే మురిపిస్తోంది మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ అసలేంటీ ప్రేమ






29, జూన్ 2021, మంగళవారం

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Maa Logililo Pandedantha Punyame Telugu Song Lyrics - Maa Annayya (2000) Telugu Song Lyrics





చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : శ్రీ సాయి హర్ష
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉన్నిమీనన్, 
చిత్ర, సుజాత 

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం 
ఈ రూపం ప్రేమకు ప్రతి రూపం

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్ళేనా 
నువ్వే అన్నై ఉండుంటే
ఏసు శిలువ మోసేనా 
నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా 
జన్మంతా జరిగేనులే
అన్నంటూ లేకుంటే 
క్షణమైనా యుగమౌనులే
కనకున్ననూ కన్నమ్మవై 
కడుపున మము దాచీ 
కాచిన దైవమా

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కటి బంధాన్ని 
కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ 
రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో 
తమ్ముళ్ళం అయ్యాములే
తన బతుకే మా మెతుకై 
తనయులమే అయ్యాములే
మా దేవుడు మాకుండగా 
మరి మాకిక లోటేది 
కలతకు చోటేది

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం 
ఈ రూపం ప్రేమకు ప్రతి రూపం

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే

మా జాబిలికి ఏడాదంతా పున్నమే 

28, జూన్ 2021, సోమవారం

కళకళలు కిలకిలలు పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Kalakalalu Kilakilalu Telugu Song Lyrics - Thammudu (1999) Telugu Songs Lyrics





చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : చంద్రబోస్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది

నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి

మెట్టినింటి దీపం నీతో 
వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే 
నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా 
జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు

ఎదురుగా నిలిచెను మా కన్నులకి 


27, జూన్ 2021, ఆదివారం

కలలోనైన కలగనలేదే నువు వస్తావని పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Kalalonaina Kalaganalede Nuvu Vasthavani Song Lyrics in Telugu - Nuvvu Vasthavani (2002) Telugu Song Lyrics

 











చిత్రం : నువ్వువస్తావని (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం





కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
ఓహొ....ఓహొ...హే...హే....

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా
కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా

జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోన వేల పదములు తరుగుతున్నవి
నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది
ఓహొ...ఓహొ....

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాధించనా
నాచెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహొ...ఓహొ...

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
హే...హే.....హే...హే... 





26, జూన్ 2021, శనివారం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Chukkalanni Muggulai Pakkumanna Mungili Telugu Song Lyrics - Suryavamsam (1998) Telugu Songs Lyrics

 




చిత్రం : సూర్యవంశం (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత   

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

నువ్వే తోడుగ ఉండే జీవితం
నిటూర్పు జాడేలేని నిత్యనూతనం
నువ్వే నీడగ పంచే స్నేహితం 
హేమంతం రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ 
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ
నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా 
రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయక సుర్యదీపముంది 
మన దారి చూపుతోంది

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

అన్ని రోజులు సన్నజాజులై 
అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై 
గారంగ పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేళి సంతోషాల చందనం చల్లుతూ 
ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతు 
సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం 
పంచుతోంది నిత్యం 
మన ప్రేమ పారిజతం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలలాల్ల లల లాలలాల్ల 

25, జూన్ 2021, శుక్రవారం

పుణ్య భూమి నా దేశం నమో నమామి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Punyabhoomi Naa Desam Song Lyrics in Telugu - Major Chandrakanth (1993) Telugu Songs Lyrics




















చిత్రం : మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి   
సాహిత్యం : జాలాది
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 







పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహొజ్వలిత చరిత గన్న 
భాగ్యోదయ దేశం.. నా దేశం 

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి

అదుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి
మతొన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదుటిపై 
నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు 
సార్వభౌముడు...

అడుగొ అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోసావా
నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూర్చావా
ఒరేయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు
తిని బతికె నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా
అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి, 
స్వరాజ్య పొరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు 
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి

అదిగదిగో అదిగదిగో ఆకాశం బళ్ళున తెల్లరీ
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి 
అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా
మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన 
దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటె 
ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి 
పన్ను కడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
మందీ మార్బల మెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
వందే మాతరం వందేమాతరం
వందే మాతరం వందేమాతరం 
వందేమాతరం అన్నది ఆ ఆకాశం

అజాదు హిందు ఫౌజు దళపతీ నేతాజీ
అఖండ భరత జాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమనీ
స్వతంత్ర భరతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చేయాలని
హిందు ఫౌజు జై హిందని నడిపాడు
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

గాంధీజి కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
ధృవతారల కన్నది ఈ దేశం
చరితార్దుల కన్నది 
నా భరత దేశం నా దేశం

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి


నన్ను కన్న నా దేశం నమో నమామి

అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి 






24, జూన్ 2021, గురువారం

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా పాట లిరిక్స్ - బాలు గారి స్మరణలో - Suvvi Suvvi Suvvaalamma Seethalamma Telugu Song Lyrics - Swathimuthyam (1986) Telugu Songs Lyrics





చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం  : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ

ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
...ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...

అండా దండా ఉండాలని 
కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని 
కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే 
నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే 
నిను కొండా కోనల కొదిలేశాడా
 
అగ్గీ లోనా దూకి 
పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
 
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

చుట్టూ ఉన్నా చెట్టు చేమ 
తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ 
తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే 
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే 
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి 
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు 
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు 
చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ..

23, జూన్ 2021, బుధవారం

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Jabilli Kosam Aakasamalle Vechaanu Nee Raakakai Telugu Song Lyrics - Manchi Manasulu (1986) Telugu Songs Lyrics







చిత్రం : మంచిమనసులు (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పూవ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండీ లేక ఉన్నది నువ్వే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

22, జూన్ 2021, మంగళవారం

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Paatala Pallakivai Oorege Chinnari Song Lyrics in Telugu - Nuvvu Vasthavani (2000) Telugu Songs Lyrics


















చిత్రం : నువ్వు వస్తావని (2000)
సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్ 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం








పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి... 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తన రూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రుపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే 
గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి 




21, జూన్ 2021, సోమవారం

ఒకడే ఒక్కడు మొనగాడు పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Okade Okkadu Monagadu Song Lyrics in Telugu - Muthu (1995) Telugu Songs Lyrics

















చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : భువనచంద్ర 
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

సయ్య సయ్యారె సయ్యారె సయ్యా… 
హె..హె…ఎ. ఎ
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా…ఆ…

మట్టి మీద మనిషికి ఆశ 
మనిషి మీద మట్టికి ఆశ 
మట్టి మీద మనిషికి ఆశ 
మనిషి మీద మట్టికి ఆశ 
మన్నే చివరికి గెలిచేదీ 
అది మరణం తోనే తెలిసేది
కష్టం చేసి కాసు గడిస్తే 
నీవే దానికి యజమాని
కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే 
డబ్బే నీకు యజమాని
జీవిత సత్యం మరవకురా 
జీవితమే ఒక స్వప్నమురా

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు
 
వాన మనదీ ప్రకృతి మనదీ 
తన పర భేదం ఎందుకు వినరా 
వాన మనదీ ప్రకృతి మనదీ 
తన పర భేదం ఎందుకు వినరా 
కాలచక్రం నిలవదురా 
ఈ నేల స్వార్ధం ఎరగదురా
పచ్చని చెట్టు పాడే పక్షి 
ఇరులు ఝరులు ఎవ్వరివి
మంచిని మెచ్చే గుణమే ఉంటే 
ముల్లోకాలు అందరివి
జీవితమంటే పోరాటం 
అది మనసుకి తీరని ఆరాటం

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
హాఅ..
ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు