2, ఆగస్టు 2021, సోమవారం

కులుకులే చెలి నడకలుగా పాట లిరిక్స్ - Kulukule Cheli Nadakalugaa Song Lyrics in Telugu - Yodha (1992) Telugu Songs Lyrics



















 చిత్రం : యోధ (1992)

సాహిత్యం : వెన్నెలకంటి

సంగీతం : ఎ.అర్.రెహ్మాన్

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ 











కులుకులే చెలి నడకలుగా 

తొణికిన కవిత ఇది 

కలగనే తడబడు పరువం 

నిమిరిన వయసు ఇది 


కొసరే విరహం ముసిరే సమయం 

అడిగెను వలపు వరం 

పిలిచే ప్రణయం తొలిచే హృదయం

మధనుడి విరుల సెరం 


అదిరిన చెలి ఆధరం 

ముదిరిన కథ మధురం 

హిమగిరి శిఖరములో 

సెగలే రగిలే వగల జ్వరం 


కులుకులే చెలి నడకలుగా 

తొణికిన కవిత ఇది 

కలగనే తడబడు పరువం 

నిమిరిన వయసు ఇది


పొంగే ప్రాయం చేసే మాయాజాలం 

పులకింతేదో కోరిందమ్మా కొంటెగా 


తనువిచ్చే మోజులకి 

చెంతకొచ్చి స్వప్నమల్లె మెదిలే 

మనువొసారి తళుకే 

విప్పెనమ్మ చెప్పుకున్న కథలే 


అప్పుడే ముద్దు అప్పు ఇవ్వమంది 

కౌగిలింత దుప్పటైనది 


కులుకులే చెలి నడకలుగా 

తొణికిన కవిత ఇది 

కలగనే తడబడు పరువం 

నిమిరిన వయసు ఇది 


కొసరే విరహం ముసిరే సమయం 

అడిగెను వలపు వరం 

పిలిచే ప్రణయం తొలిచే హృదయం

మధనుడి విరుల సెరం 


అదిరిన చెలి ఆధరం 

ముదిరిన కథ మధురం 

హిమగిరి శిఖరములో 

సెగలే రగిలే వగల జ్వరం 


చలి కాలాల వెన్నెల్లోన ఈడు 

తొలి కౌగిళ్లే వేడిందమ్మా వేడిగా 

విచ్చే యదలో మొహం 

వెచ్చనైన వెచ్చగాలి తెలిసే 


సుందర నేపాల్ నగరం 

మోజు తీరా నిన్ను నన్ను కలిపే 


స్వర్గమే తాపం సొంతమీ బంధం 

సుందరం ప్రేమ సంగమం 


కులుకులే చెలి నడకలుగా 

తొణికిన కవిత ఇది 

కలగనే తడబడు పరువం 

నిమిరిన వయసు ఇది 


కొసరే విరహం ముసిరే సమయం 

అడిగెను వలపు వరం 

పిలిచే ప్రణయం తొలిచే హృదయం

మధనుడి విరుల సెరం 


అదిరిన చెలి ఆధరం 

ముదిరిన కథ మధురం 

హిమగిరి శిఖరములో 

సెగలే రగిలే వగల జ్వరం 


కులుకులే చెలి నడకలుగా 

తొణికిన కవిత ఇది 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి